యువరాజ్‌ను కాదని అశ్విన్‌కు కెప్టెన్సీ ఎందుకు?

Tue,February 27, 2018 05:37 PM

Sehwag explains why Ashwin chosen for kings Punjab Captaincy

ముంబైః ఐపీఎల్ పదకొండో సీజన్ కోసం కింగ్స్ పంజాబ్ టీమ్ అశ్విన్‌ను కెప్టెన్‌గా నియమించిన విషయం తెలిసిందే కదా. అయితే చాలా మంది అభిమానులు.. దీనిని జీర్ణించుకోలేకపోయారు. యువరాజ్‌లాంటి సీనియర్‌ను కాదని అశ్విన్‌కు కెప్టెన్సీ ఎందుకు ఇచ్చారంటూ ప్రశ్నించారు. అయితే దీనిపై ఆ టీమ్ మెంటార్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. యువరాజ్ కంటే అశ్విన్ అయితేనే ఎక్కువ కాలం కెప్టెన్‌గా ఉండగలడన్న ఉద్దేశంతో అతనికి కెప్టెన్సీ అప్పగించినట్లు వీరూ చెప్పాడు. అంతేకాదు ఓ బౌలర్ కెప్టెన్ కావాలని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని, ఎందుకంటే ఓ బౌలరే మ్యాచ్‌ను సరిగ్గా అంచనా వేయగలడని సెహ్వాగ్ అన్నాడు. అశ్విన్ అద్భుతాలు చేయగలడని అతను విశ్వాసం వ్యక్తంచేశాడు. గతంలో వసీం అక్రమ్, వకార్ యూనిస్, కపిల్‌దేవ్ అందరూ టీమ్‌ను విజయవంతంగా నడిపారు. అశ్విన్ కూడా అలా చేస్తాడన్న నమ్మకం ఉంది అని సెహ్వాగ్ అన్నాడు. టీ20 ఫార్మాట్‌ను అశ్విన్ బాగా అర్థం చేసుకోగలడు. అతను పవర్‌ప్లేలో బౌలింగ్ చేశాడు. స్లాగ్ ఓవర్లలోనూ చేశాడు. అతను బౌలర్లను త్వరగా మార్చగలడు అని సెహ్వాగ్ చెప్పాడు. అటు అశ్విన్ కూడా పంజాబ్ టీమ్ కెప్టెన్ అయినందుకు చాలా సంతోషంగా ఉందని, సీజన్ ప్రారంభం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.

3037
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles