ఆరంభం అదిరింది..తొలి టెస్టు భారత్‌దే

Sun,October 6, 2019 02:05 PM

విశాఖపట్నం: ప్రపంచ టెస్టు ఛాంపియనషిప్‌లో భారత్‌కు వరుసగా మూడో గెలుపు. సొంతగడ్డపై ఏడాదికి పైగా విరామం తర్వాత ఆడుతున్న తొలి టెస్టులో ఘన విజయం. వైజాగ్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమ్‌ఇండియా 203 పరుగుల తేడాతో భారీ విజయాన్నందుకుంది. దీంతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1-0తో భారత్‌ ఆధిక్యంలో నిలిచింది. భారత బౌలర్లలో షమీ(5/35), జడేజా(4/87) అద్వితీయ ప్రదర్శనతో సఫారీలను కుప్పకూల్చారు.

395 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 63.5 ఓవర్లలో 191 పరుగులకే ఆలౌటైంది. చివరి రోజు ఆటలో టీమ్‌ఇండియాకు తొమ్మిది వికెట్లు కావాల్సి ఉండగా.. రెచ్చిపోయిన బౌలర్లు సఫారీ జట్టును చుట్టేశారు. ఆదివారం ఉదయం సెషన్‌లో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ అద్భుత బౌలింగ్‌తో సౌతాఫ్రికా టాపార్డర్‌ స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్‌ చేరింది. ఐతే లంచ్‌ విరామానికి ముందు.. తర్వాత సెనురన్‌ ముత్తస్వామి(49 నాటౌట్‌), పైట్‌(56) చాలాసేపు పోరాడటంతో భారత్‌ గెలుపు ఆలస్యమైంది. లంచ్‌ బ్రేక్‌ తర్వాత చాలాసేపు వికెట్‌ ఇవ్వకుండా ఆచితూచి ఆడిన ఈ జోడీ ఆతిథ్య జట్టును ఇబ్బంది పెట్టింది. ఎట్టకేలకు షమీ.. పైట్‌ను బౌల్డ్‌ చేయడంతో కోహ్లీసేన గెలుపు లాంఛనమైంది. తొలి ఇన్నింగ్స్‌లో రాణించిన డీన్‌ ఎల్గర్‌(2) డుప్లెసిస్‌(13), డికాక్‌(0) విఫలమయ్యారు.5307
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles