ఇంగ్లండ్‌కు రిష‌బ్ పంత్ ప‌య‌నం..

Wed,June 12, 2019 01:45 PM

Shikhar Dhawan injured, Rishabh Pant set to fly to England

హైద‌రాబాద్: ఇండియ‌న్ ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్.. వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌లో గాయ‌ప‌డ్డ విష‌యం తెలిసిందే. అయితే గ‌బ్బ‌ర్ స్థానంలో రిష‌బ్ పంత్‌కు అవ‌కాశం క‌ల్పించారు. దీంతో రిషబ్ ఇంగ్లండ్‌కు ప‌య‌నం కానున్నాడు. సూపర్ ఫామ్‌మీదున్న ఓపెనర్ శిఖర్ ధవన్ గాయం కారణంగా మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతో గత మ్యాచ్‌లో సెంచరీతో కదం తొక్కిన ధవన్ ఎడమచేతి బొటనవేలికి గాయమైంది. ఆసీస్ పేసర్ ప్యాట్ కమ్మిన్స్ వేసిన బంతి ధవన్ చేతిని బలంగా తాకింది. గాయం తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మంగళవారం జరిపిన వైద్య పరీక్షల్లో వేలి ఎముకలో చిన్న చీలిక ఏర్పడినట్లు తేలింది. ఈ కారణంగా న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే తర్వాతి మ్యాచ్‌లకు ధవన్ సేవలు అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో రోహిత్‌శర్మతో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టనుండగా, దినేశ్ కార్తీక్ లేదా విజయ్ శంకర్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది.
5923
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles