మాలిక్ హిట్‌వికెట్.. నెటిజన్ల సెటైర్లు: వీడియో

Sat,May 18, 2019 04:31 PM

Shoaib Malik rattles all three stumps in hit-wicket dismissal

లండన్: ఆతిథ్య ఇంగ్లాండ్‌తో నాలుగో వన్డేలో పాకిస్థాన్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ అనూహ్యంగా హిట్‌వికెట్ రూపంలో వెనుదిరగడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దూకుడుగా ఆడుతున్న షోయబ్ వ్యక్తిగత స్కోరు 41 (26 బంతుల్లో 4ఫోర్లు) వద్ద మార్క్‌వుడ్ బౌలింగ్‌లో హిట్‌వికెట్‌గా ఔటయ్యాడు. మార్క్ వేసిన బంతిని స్కేర్‌కట్ చేసే క్రమంలో క్రీజులోనే కొన్ని అడుగులు వెన‌క ఉన్న‌ మాలిక్ షాట్ ఆడుతుండగా తన బ్యాట్‌తో స్టంప్స్ కొట్టాడు. దీంతో అతడు నిరాశగా పెవిలియన్ చేరాడు. అప్పటికే పాక్ స్కోరు 300 దాటింది. ఇన్నింగ్స్‌ను ఘనంగా ముగించాలన్న అతడి ఆశ నెరవేరలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. నెటిజన్లు సెటైరికల్ కామెంట్లు చేస్తున్నారు. వరల్డ్ కప్ ముంగిట పాకిస్థాన్, ఇంగ్లాండ్ జట్లకు ఇదే ఆదివారం జరిగే ఐదో వన్డేనే ఆఖరిది.
6811
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles