ప్రపంచకప్ విజయానికి యువీనే కారణమట

Tue,February 6, 2018 11:08 AM

Shubman Gill Credits Yuvraj Singh for World Cup Success


ముంబయి; విదేశీ గడ్డపై అసాధారణంగా రాణించి టీమిండియా అండర్-19 ప్రపంచకప్ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించిన భారత ప్రపంచకప్ హీరో శుభ్‌మన్ గిల్(18) తాను టోర్నీలో విజయం సాధించడానికి, అద్భుతంగా రాణించడానికి ప్రత్యేకంగా కృషి చేసిన వారి గురించి భారత్ తిరిగొచ్చిన అనంతరం వెల్లడించాడు. తాను టోర్నీలోనే అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి విలువైన సలహాలిచ్చి ప్రోత్సహించింది భారత సీనియర్ బ్యాట్స్‌మన్, ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌సింగ్ అని అతడు తెలిపాడు.

బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న సమయంలో యువీ ఆటకు సంబంధించిన కొన్ని మెలకువలు నాకు చెప్పాడు. మైదానంలో ఎలా వ్యవహరించాలనే దానిపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాడు. అక్కడ నాతో బ్యాటింగ్ చేస్తూనే పలు సూచనలు ఇచ్చాడని గిల్ పేర్కొన్నాడు. టోర్నీ సెమీ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై శుభమన్(102) అజేయ సెంచరీతో చెలరేగి భారత్‌కు విజయాన్నందించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గిల్ మాట్లాడుతూ పాక్‌పై ఆట చివరి వరకు కోచ్ రాహుల్ ద్రవిడ్ మార్గదర్శనం చేశారన్నాడు. పాక్‌తో మ్యాచ్‌లో మాపై కొంచెం ఒత్తిడి నెలకొంది. మా ఓపెనర్లు మంచి శుభారంభం అందించారు. మధ్యలో వికెట్లు కోల్పోయినప్పటికీ రాహుల్ సర్ తనను ఇన్నింగ్స్ చివరి వరకు బ్యాటింగ్ చేస్తూ మంచి భాగస్వామ్యం నెలకొల్పాలని సూచించినట్లు ఈ సందర్భంగా వెల్లడించాడు.

ఇటీవల ఐపీఎల్-11 సీజన్ కోసం నిర్వహించిన వేలంలో కనీసధర రూ.20లక్షలతో వేలంలోకి వచ్చిన శుభ్‌మన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.1.8కోట్లకు దక్కించుకొంది.

6095
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles