స్టోక్స్‌కు స్ట్రోక్ ఇచ్చిన సిద్ధార్థ్ కౌల్ క్యాచ్: వీడియో

Fri,July 13, 2018 03:19 PM

నాటింగ్‌హమ్: ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో భారత్ ఘనంగా బోణీ కొట్టింది. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్(6/25).. ఛేదనలో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ(137 నాటౌట్) చెలరేగడంతో కోహ్లీసేన ఘనవిజయం సాధించింది. రోహిత్ మెరుపు సెంచరీతో లక్ష్యాన్ని భారత్ 40.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలను చేరుకుంది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యంలో ఉంది.


భారత బౌలర్లను ధాటిగా ఎదుర్కొని పరుగులు చేయడానికి తీవ్రంగా శ్రమించిన స్టోక్స్ 100 బంతుల్లో ఆర్ధశతకం పూర్తిచేశాడు. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే కుల్దీప్ బౌలింగ్‌లో కౌల్ పట్టిన అద్భుత క్యాచ్‌కు అతడు వెనుదిరిగాడు. 45వ ఓవర్‌లో కుల్దీప్ వేసిన బంతిని బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా రివర్స్ స్వీప్ షాట్ ఆడాడు. బౌండరీ వెళ్తుందనుకున్న ఆ బంతిని గాల్లోకి ఎగిరి సిద్ధార్థ్ కౌల్ అందుకోవడంతో స్టోక్స్ నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 268 పరుగులు చేసింది.

2568
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles