బీసీసీఐ నిర్వ‌హ‌ణ ఓ స‌వాలే : సౌర‌వ్ గంగూలీ

Mon,October 14, 2019 01:21 PM

హైద‌రాబాద్‌: భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్య‌క్షుడిగా సౌర‌వ్ గంగూలీ బాధ్య‌త‌లు స్వీక‌రించే అవ‌కాశాలు ఉన్నాయి. దీనిపై ఇవాళ బెంగాల్ దాదా సౌర‌వ్ స్పందించారు. భార‌త క్రికెట్ బోర్డుకు నాయ‌క‌త్వం వ‌హించ‌డం గొప్ప అనుభూతినిస్తుంద‌న్నారు. బీసీసీఐ ప్ర‌తిష్ట‌ను బ‌లోపేతం చేసేందుకు ఇదో మంచి త‌రుణ‌మ‌న్నారు. వాస్త‌వానికి బ్రిజేష్ ప‌టేల్ .. బీసీసీఐ అధ్య‌క్ష రేసులో ఉన్నారు. కానీ అనూహ్య ప‌రిణామాల నేప‌థ్యంలో గంగూలీకి ఆ బాధ్య‌త‌లు ద‌క్కే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. దేశం కోసం ఆడాను, సార‌థిగా కూడా బాధ్య‌త‌లు చేప‌ట్టాను, గ‌త మూడేళ్ల నుంచి బీసీసీఐ ప‌నితీరు స‌రిగా లేద‌ని, ఇలాంటి సంద‌ర్భంలో బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డం గొప్ప అవ‌కాశ‌మే అని గంగూలి అన్నారు. క్రికెట్‌కు ఏదైనా మంచి చేయాల‌న్న‌దే త‌న ఉద్దేశ‌మ‌న్నారు.


47 ఏళ్ల గంగూలీ ప్ర‌స్తుతం బెంగాల్ క్రికెట్ సంఘం అధ్య‌క్షుడిగా ఉన్నారు. దేశ‌వాళీ క్రికెట్ ఆడే ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్లను ఆర్థికంగా బ‌లోపేతం చేయ‌డ‌మే త‌న మొద‌టి క‌ర్త‌వ్య‌మ‌న్నారు. నిజానికి బీసీసీఐ అధ్య‌క్ష ప‌ద‌వి కోసం నామినేష‌న్ వేసేందుకు సోమ‌వార‌మే చివ‌రితేది. కానీ గంగూలీ నియామ‌కం ప‌ట్ల వ్య‌తిరేక‌త వ్య‌కం కాలేదు. దీంతో ఎవ‌రూ నామినేష‌న్ వేయ‌లేదు. ఏక‌ప‌క్షంగా గెల‌వ‌డం ముఖ్యం కాదు అని, ప్ర‌పంచ క్రికెట్‌లోనే బీసీసీఐ అతిపెద్ద సంస్థ అని, దాని బాధ్య‌త‌లు చూసుకోవ‌డం ముఖ్య‌మ‌న్నారు. ఆర్థిక‌ప‌రంగా బీసీసీఐ కీల‌క‌మైంద‌ని, అలాంటి సంస్థకు అధ్య‌క్ష బాధ్య‌త‌లు నిర్వ‌హించ‌డం స‌వాలే అని గంగూలీ అన్నారు.

1496
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles