దక్షిణాఫ్రికా ఘనవిజయం సిరీస్ సమం

Sun,September 22, 2019 10:17 PM

బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో ఇండియా, దక్షిణాఫ్రికా తలపడిన చివరి టీ-20లో దక్షిణాఫ్రికా 9 వికెట్లతో ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ క్వింటన్ డీ కాక్(79) బౌండరీలు(6), సిక్సర్ల(5)తో విరుచుకుపడ్డాడు. అతనికి తోడు వన్ డౌన్ బ్యాట్స్‌మన్ బావుమా (27) చెలరేగడంతో సౌతాఫ్రికా మరో 3.1 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. హార్ధిక్ పాండ్యా ఒక వికెట్ తీశాడు. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. రెండో మ్యాచ్‌లో ఇండియా విజయం సాధించగా, మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే.

470
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles