చెట్టెక్కిన శ్రీలంక అభిమాని.. ఇదీ అత‌ని డిమాండ్‌

Tue,June 4, 2019 01:00 PM

హైద‌రాబాద్: శ్రీలంకకు చెందిన ఓ క్రికెట్‌ అభిమాని వింత ప‌ద్ధ‌తిలో నిర‌స‌న వ్య‌క్తం చేశాడు. వ‌ర‌ల్డ్‌క‌ప్ తొలి మ్యాచ్‌లో కివీస్ చేతిలో శ్రీలంక దారుణంగా ఓడిన విష‌యం తెలిసిందే. అయితే ఓ భారీ మ‌ర్రి చెట్టు ఎక్కిన శ్రీలంక అభిమాని.. టీమ్‌లోని ఆల్‌రౌండ‌ర్ తిసెరా పెరీరాను ఓపెన‌ర్‌గా పంపాలంటూ డిమాండ్ చేస్తున్నాడు. ఆల్‌రౌండ‌ర్ పెరీరా బ్యాటింగ్ ఆర్డ‌ర్‌ను మార్చాల‌ని ఆ అభిమాని చెట్టు ఎక్కాడు. అయితే ఆ అభిమాని డిమాండ్‌కు మాజీ క్రికెట‌ర్ ర‌స్సెల్ అర్నాల్డ్ కూడా లైక్ కొట్టాడు. నిర‌స‌న‌ను కొన‌సాగించాలంటూ ఆ అభిమానిని అర్నాల్డ్ ప్రోత్స‌హించాడు. ఇవాళ వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఆఫ్ఘ‌నిస్తాన్‌తో శ్రీలంక పోటీప‌డ‌నున్న‌ది.2343
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles