ఆ రికార్డును స్టీవ్ స్మిత్ అధిగమించగలడా..!

Wed,September 11, 2019 02:42 PM

Steve Smith can break that record!

లండన్: ఆస్ట్రేలియా బ్యాటింగ్ సంచలనం స్మిత్ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఓ బ్యాట్స్‌మెన్ చేసిన అత్యధిక పరుగులు 829. ఈ పరుగులు చేసింది విండీస్ దిగ్గజ ఆటగాడు వివియన్ రిచర్డ్స్. 1976లో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో అతడు ఈ రికార్డు నెలకొల్పాడు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో వివ్ నాలుగు మ్యాచ్‌ల్లోనే ఈ పరుగులు సాధించాడు. అనారోగ్య కారణంగా ఓ మ్యాచ్ ఆడలేకపోయాడు. అతడి తర్వాత వరుసగా సునీల్ గవాస్కర్ (ఇండియా)774 పరుగులు, గ్రాహమ్‌గూచ్(ఇంగ్లాండ్) 752 పరుగులు, బ్రియాన్‌లారా(వెస్టిండీస్) 688 పరుగులతో ఉన్నారు.


రిచర్డ్స్ ఈ రికారు ్డ సృష్టించి దాదాపు 43ఏళ్లు గడిచింది. ఈ రికార్డు బద్దలవ్వాలంటే స్మిత్ ఇంకా 159 పరుగులు చేయాలి. అతడు ఇప్పటికే యాషెస్ సిరీస్‌లో 134.20 సగటుతో 671 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో ఐసీసీ నెంబర్ వన్ ర్యాంక్‌ను సైతం అందుకున్నాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న స్మిత్ ఈ రికార్డు తప్పకుండా బద్దలు కొడతాడని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు.

766
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles