స్టీవ్‌స్మిత్‌ బ్రిలియంట్‌ క్యాచ్‌. వార్నర్‌ ఔట్‌: వీడియో

Sun,April 28, 2019 03:37 PM

Steve Smith Takes Stunner To Dismiss David Warner

జైపూర్‌: ప్లేఆఫ్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ అదరగొట్టింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను చిత్తుచేసి సునాయాసంగా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ముందు బ్యాటింగ్‌ చేసింది. మనీశ్‌ పాండే, డేవిడ్‌ వార్నర్‌ మెరుపులతో 12 ఓవర్లు ముగిసేసరికి 103/1తో పటిస్థితిలో నిలిచింది. చేతిలో 9 వికెట్లు ఉండటంతో భారీ స్కోరు చేస్తుందని అనుకున్నారంతా. కానీ, మరుసటి బంతికే ఆజట్టు సారథి స్టీవ్‌స్మిత్‌ పట్టిన సూపర్‌క్యాచ్‌కు వార్నర్‌ వెనుదిరిగాడు. ఒంటిచేత్తో క్యాచ్‌ పట్టినప్పుడు అతని కుడిచేతికి గాయం కూడా అయింది. ఐతే నొప్పి గురించి పెద్దగా ఆందళన చెందాల్సిన అవసరం లేదని మ్యాచ్‌ అనంతరం స్మిత్‌ వివరించాడు.

సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు చేసింది. మనీశ్ పాండే (36 బంతుల్లో 61; 9 ఫోర్లు) వరుసగా రెండో అర్ధసెంచరీతో ఆకట్టుకుంటే.. వార్నర్ (32 బంతుల్లో 37) ఫర్వాలేదనిపించాడు. రాయల్స్ బౌలర్లలో ఉనాద్కట్, థామస్, గోపాల్, అరోన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. వార్నర్ వరుసగా ఆడిన మూడో ఐపీఎల్ సీజన్‌లోనూ 600 పరుగులు పూర్తి చేయడం విశేషం. అనంతరం లక్ష్య ఛేదనలో ఓపెనర్లు లివింగ్‌స్టోన్ (26 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), రహానే (34 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్)తో పాటు సంజూ శాంసన్ (32 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) అదరగొట్టడంతో రాయల్స్ 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. ఉనాద్కట్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

1655
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles