స్మిత్‌ త్వరలోనే ఆసీస్‌ కెప్టెన్‌ అవుతాడు: మార్క్‌ టేలర్‌

Thu,September 12, 2019 01:24 PM

STEVE SMITH WILL ACPTAIN AGAIN ASTRALIA TEAM

ఓవల్‌: సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆసీస్‌ జట్టు బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడిందని ఆధారాలతో సహా రుజువవడంతో కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, వైస్‌ కెప్టెన్‌ వార్నర్‌, బాన్‌క్రాఫ్ట్‌లపై క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) 12 నెలల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. నిషేధానంతరం వార్నర్‌ ఐపీఎల్‌లో అదరగొట్టి, టోర్నీలో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. స్మిత్‌ మాత్రం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న కీలక యాషెస్‌ సిరీస్‌లో బీభత్సంగా ఆడుతున్నాడు. సిరీస్‌లో ఇప్పటికే రికార్డు స్థాయిలో ఓ డబుల్‌ సెంచరీ సహా, రెండు సెచరీలు, రెండు అర్ధసెంచరీలతో 671 పరుగులు చేశాడు. మరో మ్యాచ్‌ మిగిలుండడంతో ఓ సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌గానూ రికార్డు సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాడు.

కాగా, స్మిత్‌ త్వరలోనే ఆస్ట్రేలియా పగ్గాలు అందుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ మార్క్‌ టేలర్‌. ఒక సంవత్సరం అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి బ్యాన్‌ చేయగా, మరో ఏడాది పాటు కెప్టెన్‌గా భాద్యతలు చేపట్టరాదని సీఏ అప్పుడే తెలిపింది. కనుక స్మిత్‌ కెప్టెన్‌ కావడానికి మరికొంత కాలం వేచి చూడాల్సిందేనని ఆయన అన్నాడు.

టిమ్‌ పైన్‌ తాత్కాలికంగానే కెప్టెన్‌గా ఉన్నాడని, స్మిత్‌పై నిషేధం తొలిగాక అతను మళ్లీ కెప్టెన్‌ కావడం ఖాయమని ఆయన అన్నారు. టెస్టు ర్యాంకుల్లోనూ నెంబర్‌ వన్‌ ర్యాంక్‌లో ఉన్న స్మిత్‌ టెస్టుల్లో 26 సెంచరీలు సాధించాడు.

702
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles