స్టోక్స్‌కు స్ట్రోక్ ఇచ్చిన సురేశ్ రైనా..

Fri,April 20, 2018 08:44 PM


పుణె : గాయం కారణంగా రెండు మ్యాచ్‌లకు దూరమై ఫిట్‌నెస్ సాధించిన తరువాత మైదానంలో అడుగుపెట్టిన స్టార్ ఆల్‌రౌండర్ సురేశ్ రైనా ఫామ్‌లోకి వచ్చాడు. చెన్నై ఓపెనర్ అంబటి రాయుడు(12) ఔటైన తరువాత క్రీజులోకి వచ్చిన రైనా రాజస్థాన్ రాయల్స్ బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. ఐదో ఓవర్లో రెండు బంతులు ఎదుర్కొని రెండు పరుగులు మాత్రమే సాధించిన రైనా.. బెన్‌స్టోక్స్ వేసిన తరువాతి రెండు బంతులకు పరుగులేమీ రాబట్టలేదు. కానీ, ఆ ఓవర్ తరువాతి నాలుగు బంతులను మాత్రం వరుసగా ఫోర్లు బాది స్టోక్స్‌కు స్ట్రోక్ ఇచ్చాడు. దీంతో రైనా ఒక్కడే ఆరో ఓవర్లో 16 పరుగులు సంపాదించాడు.


మరో ఎండ్‌లో ఓపెనర్ షేన్ వాట్సన్ ధాటిగా ఆడుతున్నాడు. రాజస్థాన్ బౌలర్లపై చెలరేగుతూ చెన్నైని భారీ స్కోరు దిశగా నడిపిస్తున్నాడు. ప్రస్తుతం 7 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి చెన్నై 74 పరుగులు చేసింది. వాట్సన్(42), రైనా(19) క్రీజులో ఉన్నారు.

4396
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles