రైనా ఖాతాలో మరో టీ20 రికార్డు

Fri,March 9, 2018 03:57 PM

Suresh Raina now joins other two Indian batsmen who hit more than 50 sixes in T20s

కొలంబోః టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా మరో టీ20 రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో 50 సిక్సర్లు బాదిన ప్లేయర్స్ లిస్ట్‌లో చోటు సంపాదించాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20లో రైనా ఈ రికార్డు అందుకున్నాడు. ఇండియా తరఫున ఈ ఘనత సాధించిన మూడో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. యువరాజ్ 74 సిక్సర్లతో ఫస్ట్‌ప్లేస్‌లో ఉండగా.. రోహిత్ శర్మ 69 సిక్సర్లతో రెండోస్థానంలో ఉన్నాడు. ఇక ధోనీ 46 సిక్సర్లతో, కోహ్లి 41 సిక్సర్లతో నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. ఇక ఓవరాల్‌గా టీ20ల్లో అత్యధిక సిక్సర్ల రికార్డు క్రిస్ గేల్, మార్టిన్ గప్టిల్ పేరిట ఉంది. ఈ ఇద్దరూ 103 సిక్సర్లు బాదారు. బంగ్లాదేశ్‌తో టీ20ల్లో రైనా 27 బంతుల్లో 28 రన్స్ చేశాడు.

3422
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles