కోహ్లి రికార్డుకు చేరువలో రైనా!

Tue,May 22, 2018 03:17 PM

Suresh Raina on a verge of to become highest run getter record in IPL

ముంబై: ఐపీఎల్ చివరి వారంలోకి ఎంటరైంది. లీగ్ స్టేజ్‌లో టాప్‌లో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఇవాళ తొలి క్వాలిఫయర్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్ నేరుగా ఫైనల్ చేరనుండగా.. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచే టీమ్‌తో ఇవాళ్టి మ్యాచ్‌లో ఓడిన టీమ్ తలపడుతుంది. అయితే క్వాలిఫయర్ 1కి ముందు అందరి కళ్లు చెన్నై బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా పైనే ఉన్నాయి. బెంగళూరు టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి రికార్డుకు రైనా చేరవలో ఉన్నాడు.

ఐపీఎల్‌లో అత్యధిక పరుగుల వీరుడిగా నిలవడానికి రైనా కేవలం 17 పరుగుల దూరంలో ఉన్నాడు. కోహ్లి 4948 పరుగులతో టాప్ ప్లేస్‌లో ఉండగా.. రైనా 4931 పరుగులతో రెండోస్థానంలో ఉన్నాడు. ఇప్పటికే బెంగళూరు టీమ్ ఐపీఎల్ నుంచి బయటకు వెళ్లిపోవడంతో ఈ సీజన్ ముగిసేలోపు టాప్ స్కోరర్‌గా రైనా నిలవడానికి మంచి అవకాశం ఉంది. రైనా ఐపీఎల్‌లో 174 మ్యాచ్‌లు ఆడి ఒక సెంచరీ, 35 హాఫ్ సెంచరీలు చేశాడు. అటు కోహ్లి పేరిట 4 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ లిస్ట్‌లో 4493 పరుగులతో రోహిత్ శర్మ మూడోస్థానంలో ఉన్నాడు.

3088
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles