సిక్స్ ప్యాక్‌తో షాకిచ్చిన బుమ్రా.. బీచ్ పార్టీలో టీమిండియా ఆటగాళ్లు..

Thu,August 22, 2019 10:49 AM

ఆంటిగ్వా: వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా నేటి నుంచి ఆంటిగ్వాలో విండీస్‌తో టెస్టు సిరీస్‌లో తలపడనున్న విషయం విదితమే. ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో నేడు భారత్, విండీస్‌ల మధ్య మొదటి టెస్టు ఆరంభం కానుంది. కాగా ఈ మ్యాచ్ కోసం సిద్ధమవుతున్న భారత ఆటగాళ్లు కాసేపు బీచ్ పార్టీలో సేదదీరారు.


ఆంటిగ్వాలోని జాలీ బీచ్‌లో విరాట్‌కోహ్లి సహా టీమిండియా ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కలిసి కొంత సేపు సరదాగా గడిపారు. ఈ సందర్భంగా వారందరూ బీచ్ స్విమ్మింగ్ పూల్‌లో కాసేపు ఈత కొట్టారు. అనంతరం ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ క్రమంలో తీసిన ఓ ఫొటోను కెప్టెన్ కోహ్లి తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో షేర్ చేశాడు. అందులో బుమ్రా సిక్స్ ప్యాక్‌లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చాడు. కాగా ఈ ఫొటోలో మయాంక్ అగర్వాల్, ఇషాంత్ శర్మ, రిషబ్ పంత్, అజింక్యా రహానే, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌తోపాటు టీమిండియా సహాయక సిబ్బంది కూడా ఉన్నారు.

2141
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles