నువ్వేమైనా ధోనీ అనుకుంటున్నావా.. కార్తీక్‌పై ఫ్యాన్స్ సీరియస్!

Mon,February 11, 2019 01:49 PM

Team India Fans furious on Dinesh Karthik over he denying single to Krunal Pandya

హామిల్టన్: దినేష్ కార్తీక్.. ఏడాది కాలంగా టీమిండియాలో కుదురుకున్న బ్యాట్స్‌మన్. ఈ మధ్య కాలంలో ఎన్నో మ్యాచ్‌లు గెలవడంలో కీలకపాత్ర కూడా పోషించాడు. గతేడాది శ్రీలంకలో జరిగిన నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై చివరి బంతికి సిక్స్ కొట్టి టీమ్‌ను గెలిపించాడు. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లోనూ అలాంటి అవకాశమే కార్తీక్‌కు దక్కింది. అలాగే చివరి బంతికి అతడు సిక్స్ కొట్టాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యం కావడంతో నాలుగు పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోయింది. అయితే చివరి ఓవర్లో 16 పరుగులు కావాల్సి ఉండగా.. కీలక సమయంలో కార్తీక్ రెండు డాట్ బాల్స్ ఆడటం టీమ్ కొంప ముంచింది. అందులో ఒక బంతికి సింగిల్ తీసే అవకాశం ఉన్నా.. కృనాల్‌కు ైస్ట్రెక్ ఇవ్వడానికి కార్తీక్ నిరాకరించాడు. దీనిపైనే అభిమానులు ఫైర్ అవుతున్నారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో టెయిలెండర్లతో కలిసి ఆడే ధోనీ.. సింగిల్స్ తీసుకోవడానికి ఇష్టపడడు. అయితే చాలా సందర్భాల్లో ధోనీ మ్యాచ్‌లను గెలిపించాడు కూడా. కార్తీక్ కూడా ధోనీలాగే సింగిల్‌కు నిరాకరించినా.. మ్యాచ్‌ను గెలిపించకపోవడంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పైగా అవతలి వైపు ఉన్న కృనాల్ కూడా భారీ షాట్లు ఆడగలిగే వాడే. సింగిల్ తీసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దీంతో ట్విటర్‌లో కార్తీక్‌కు వ్యతిరేకంగా ట్వీట్లు చేశారు.3876
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles