తన గురువుకు నివాళులు అర్పించిన సచిన్

Thu,September 5, 2019 03:57 PM

ముంబై: సచిన్ టెండూల్కర్.. పరిచయం అక్కర్లేని పేరు. క్రికెట్‌లో ఎన్నో రికార్డులు సృష్టించిన సచిన్ నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తన గురువు(క్రికెట్ కోచ్) రమాకాంత్ ఆచ్రేకర్ చిత్రపటానికి నివాళి అర్పించారు. ఆయన ఈ సంవత్సరం జనవరిలో మరణించిన సంగతి తెలిసిందే.


ఈ సందర్భంగా సచిన్ ట్విట్టర్‌లో ఫోటోతో పాటు గురువు గురించి ఇలా చెప్పారు.. గురువు విద్యాబుద్దులు మాత్రమే కాకుండా, మన జీవితంలో ఎలా మెలగాలో తెలిపే విలువలు కూడా నేర్పిస్తారు. ఆచ్రేకర్ సర్ నాకు క్రికెట్‌తో పాటు జీవితంలో ఎలా నడుచుకోవాలో నేర్పించారు. ఆయన మాటలను నేనెప్పుడూ మర్చిపోను. ఇప్పటికీ ఆయనను తలుచుకున్నప్పుడల్లా తన విలువైన మాటలు, సూచనలు గుర్తొస్తాయి అని అన్నారు.


971
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles