సచిన్ 29 ఏండ్ల రికార్డు బద్దలు

Sun,January 27, 2019 06:32 AM

దుబాయ్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 29 ఏండ్ల రికార్డు ను నేపాల్ కుర్ర క్రికెటర్ రోహిత్ పౌదెల్ బద్దలు కొట్టాడు. యూఏఈతో జరిగిన వన్డే మ్యాచ్‌లో రోహిత్ అర్ధసెంచరీతో అదరగొట్టాడు. ఇలా అతిపిన్న వయస్సు(16 ఏండ్ల 146 రోజులు)లో అంతర్జాతీయ క్రికెట్‌లో అర్ధసెంచరీ చేసిన రికార్డును రోహిత్ నెలకొల్పాడు. ఈ క్రమంలో 1989లో పాకిస్థాన్‌పై ఫైసలాబాద్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో సచిన్(16 ఏండ్ల 213 రోజులు) నెలకొల్పిన రికార్డును తాజాగా తుడిచిపెట్టాడు. దీంతో పాటు వన్డేల్లో శ్రీలంకపై పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ(16 ఏండ్ల 217 రోజులు) పేరిట ఉన్న అర్ధసెంచరీ ఫీట్‌ను కూడా రోహిత్ అధిగమించాడు. రోహిత్ రాణింపుతో 242/9 స్కోరు చేసిన నేపాల్..యూఏఈని 97 పరుగులకే కుప్పకూల్చి 145 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

7220
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles