మా ఆటగాళ్లను ఇండియా బెదిరిస్తుందన్న వార్తలు అవాస్తవం

Wed,September 11, 2019 05:07 PM

The news that India is threatening our players is untrue

కొలంబో: ఈ నెలాఖరులో శ్రీలంక పాకిస్తాన్‌లో పర్యటించాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 27న లంక పాక్‌తో తొలి వన్డే ఆడాలి. కానీ, వారు భద్రతా కారణాలరీత్యా వారు పాక్‌లో పర్యటించబోమని తేల్చి చెప్పారు. చాలా ఏళ్ల తర్వాత తమ దేశంలో అంతర్జాతీయ క్రికెట్ సంబరం జరగబోతోందని చాలా సంతోషంగా ఉన్న పాక్‌ను ఈ వార్త కలవరపెడుతోంది. దీంతో ఎటూ తోచక ఇండియాపై తమ అక్కసు వెళ్లగక్కింది.

శ్రీలంక ఆటగాళ్లను ఇండియా బెదిరిస్తోందనీ, పాక్ పర్యటనకు వెళ్తే ఐపీఎల్ కాంట్రాక్టులు రద్దు చేస్తామని బ్లాక్‌మెయిల్ చేశారని, అందుకే వారు పాక్ పర్యటనకు రావడం లేదని పాకిస్తాన్ మంత్రి ఫవాద్ హుస్సేన్ చౌదరి ఆరోపించిన విషయం తెలిసిందే.

అయితే ఈ వార్తలపై స్పందించిన లంక మంత్రి హరిన్ ఫెర్నాండో.. మా జట్టు నిర్ణయంలో ఎవరి ప్రమేయం ఉండబోదనీ, పాక్ మంత్రి అన్నట్లు తమను ఇండియన్స్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్న వార్తలు పూర్తిగా అవాస్తవం. పాక్‌లో పర్యటించడం జట్టులోని ప్రధాన ఆటగాళ్లకు అస్సలు ఇష్టం లేదన్నారు. టీ-20 కెప్టెన్ మలింగకు సైతం ఈ పర్యటన ఇష్టం లేదని తేల్చారు. గతంలో మా జట్టుపై జరిగిన ఉగ్రదాడే ఇందుకు ప్రధాన కారణమని ఆయన అన్నారు.

2009లో పాక్‌లో పర్యటించిన శ్రీలంక జట్టుపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. అదృష్టవశాత్తూ క్రికెటర్లు బస్సులో ఉండడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో స్థానిక ప్రజలు 8మంది మరణించగా, చాలా మంది గాయాలపాలయ్యారు.

1704
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles