ఐపీఎల్ వేలంలో కోట్లు కొల్లగొట్టింది వీళ్లే..

Sun,January 28, 2018 05:28 PM

బెంగళూరుః ఎంతగానో ఆసక్తి రేపిన ఐపీఎల్ మెగా వేలం ముగిసింది. మొత్తం 578 ప్లేయర్స్‌కుగాను 167 మందిని ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. ఈసారి కూడా ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ రూ.12.5 కోట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచాడు. అయితే ఇండియన్ స్టార్స్‌కు ఈ వేలంలో కోట్లు దక్కాయి. అత్యధికంగా జయదేవ్ ఉనద్కట్ రూ.11.5 కోట్లతో తొలి స్థానంలో నిలిచాడు. మనీష్ పాండే, కేఎల్ రాహుల్, సంజు శాంసన్, కృనాల్ పాండ్యాలాంటి స్టార్స్ కూడా సత్తా చాటారు. ఈ నేపథ్యంలో ఏ ప్లేయర్ ఎన్ని కోట్లు కొల్లగొట్టాడో ఓసారి చూద్దాం.


మిలియనీర్లయిన ఇండియన్ స్టార్స్
జయదేవ్ ఉనద్కట్ (రూ.11.5 కోట్లు, రాజస్థాన్ రాయల్స్)
మనీష్ పాండే (రూ.11 కోట్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్)
కేఎల్ రాహుల్ (రూ.11 కోట్లు, కింగ్స్ పంజాబ్)
కృనాల్ పాండ్యా (రూ.8.8 కోట్లు, ముంబై ఇండియన్స్)
సంజు శాంసన్ (రూ.8 కోట్లు, రాజస్థాన్ రాయల్స్)
కేదార్ జాదవ్ (రూ.7.8 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్)
అశ్విన్ (రూ.7.6 కోట్లు, కింగ్స్ పంజాబ్)
దినేష్ కార్తీక్ (రూ.7.4 కోట్లు, కోల్‌కతా నైట్‌రైడర్స్)
రాబిన్ ఉతప్ప (రూ.6.4 కోట్లు, కోల్‌కతా నైట్‌రైడర్స్)
కరుణ్ నాయర్ (రూ.5.6 కోట్లు, కింగ్స్ పంజాబ్)
శిఖర్ ధావన్ (రూ.5.2 కోట్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్)
కరణ్ శర్మ (రూ.5 కోట్లు, చెన్నై సూపర్‌కింగ్స్)
వృద్ధిమాన్ సాహా (రూ.5 కోట్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్)

కోట్లు కొల్లగొట్టిన విదేశీ ప్లేయర్స్
బెన్ స్టోక్స్ (రూ.12.5 కోట్లు, రాజస్థాన్ రాయల్స్)
క్రిస్ లిన్ (రూ.9.6 కోట్లు, కోల్‌కతా నైట్‌రైడర్స్)
మిచెల్ స్టార్క్ (రూ.9.4 కోట్లు, కోల్‌కతా నైట్‌రైడర్స్)
గ్లెన్ మ్యాక్స్‌వెల్ (రూ.9 కోట్లు, ఢిల్లీ డేర్‌డెవిల్స్)
రషీద్ ఖాన్ (రూ.9 కోట్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్)
క్రిస్ వోక్స్ (రూ.7.4 కోట్లు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు)
ఆండ్రూ టై (రూ.7.2 కోట్లు, కింగ్స్ పంజాబ్)
డ్వేన్ బ్రేవో (రూ.6.2 కోట్లు, చెన్నై సూపర్‌కింగ్స్)
కీరన్ పొలార్డ్ (రూ.5.4 కోట్లు, ముంబై ఇండియన్స్)
పాట్ కమిన్స్ (రూ.5.4 కోట్లు, ముంబై ఇండియన్స్)

3854
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles