క‌ళ్లు మూసుకున్నారా.. అంపైర్ల‌పై కోహ్లి సీరియ‌స్‌

Fri,March 29, 2019 12:31 PM

This is not club cricket says Virat Kohli after No ball controversy rocks IPL

బెంగళూరు: ఐపీఎల్‌ను రోజుకో వివాదం చుట్టు ముడుతున్నది. తాజాగా ముంబై, బెంగళూరు మ్యాచ్‌లో చివరి బంతిని అంపైర్ నో బాల్‌గా ప్రకటించకపోవడం ఆర్సీబీకి మ్యాచ్‌నే దూరం చేసింది. చివరి బంతికి ఏడు పరుగులు చేయాల్సి ఉండగా.. మలింగ నోబాల్ వేశాడు. అయితే అంపైర్ ఎస్ రవి దానిని గమనించలేదు. మ్యాచ్ తర్వాత జెయింట్ స్క్రీన్‌పై మలింగ నోబాల్ వేసినట్లుగా చూపించడంతో అది చూసిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రెజెంటేషన్ సెర్మనీ సందర్భంగా కోహ్లి తన అసంతృప్తిని వెల్లగక్కాడు. మనం ఐపీఎల్ స్థాయిలో ఆడుతున్నాం. ఇదేమీ క్లబ్ క్రికెట్ కాదు. ఇది మరీ హాస్యాస్పదంగా ఉంది. అంపైర్లు కళ్లు తెరిచి పని చేయాలి. అది నో బాల్ అని స్పష్టంగా కనిపిస్తున్నది. ఒకవేళ నోబాల్ ఇచ్చి ఉంటే మ్యాచ్ మరోలా ఉండేది. అంపైర్లు కాస్త జాగ్రత్తగా, మరింత చురుకుగా పని చేయాలి అని కోహ్లి అనడం విశేషం. ఒకవేళ అది నోబాల్‌గా ప్రకటించి ఉంటే తర్వాతి బాల్ ఫ్రీహిట్ అయ్యేది. ఆ అవకాశం కోల్పోవడంతో కోహ్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. మలింగ వేసిన నోబాల్ ఇదే.


3184
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles