దటీజ్ ధోనీ.. పుణె గ్రౌండ్‌మెన్‌కు స్పెషల్ గిఫ్ట్

Mon,May 21, 2018 02:46 PM

This is what MS Dhoni gifted Pune Groundsmen after end of the last match

పుణె: ధోనీ అంటే అంతే మరి. గొప్ప ప్లేయర్, గొప్ప కెప్టెన్‌గానే కాదు.. అంతకుమించి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి అతడు. తాజాగా మరోసారి ఈ మిస్టర్ కూల్ తన గొప్పతనాన్ని చాటుకున్నాడు. ఈ సీజన్ ఐపీఎల్‌లో చెన్నై టీమ్‌కు హోమ్‌గ్రౌండ్‌గా పుణె ఉన్న విషయం తెలిసిందే కదా. కావేరీ జలాల విషయంలో తమిళనాడులో ఆందోళనల నేపథ్యంలో ఒక్క మ్యాచ్ కాగానే మిగిలిన ఆరు హోం మ్యాచ్‌లను పుణెకు తరలించారు. అయితే ఈ గ్రౌండ్ చెన్నై టీమ్‌కు బాగానే కలిసొచ్చింది. ఇక్కడ ఆడిన ఆరు మ్యాచుల్లో ఐదు గెలిచింది.


కింగ్స్ పంజాబ్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లోనూ సునాయాసంగా విజయం సాధించింది. దీంతో పుణె గ్రౌండ్స్‌మెన్‌కు మరచిపోలేని గిఫ్ట్ ఇవ్వాలని ధోనీ భావించాడు. చెన్నై టీమ్ తరఫున వాళ్లకు ఒక్కొక్కరికి రూ.20 వేల నగదుతోపాటు తనతో దిగిన ఫొటోను కూడా ఫ్రేమ్ కట్టించి ఇచ్చాడు. అతి తక్కువ సమయంలో గ్రౌండ్‌ను మ్యాచ్‌లకు సిద్ధం చేసిన గ్రౌండ్ సిబ్బందికి ఏదో తమకు తోచిన సాయం చేసినట్లు చెన్నై టీమ్ మేనేజ్‌మెంట్ సభ్యుడొకరు తెలిపారు. పుణెలో జరిగిన చివరి మ్యాచ్ ముగియగానే ధోనీ గ్రౌండ్స్‌మెన్‌ను కలిసి ఈ గిఫ్ట్‌లు అందజేశాడు.

2991
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles