హెచ్‌సీఏలో త్రిముఖ పోరు

Thu,September 26, 2019 06:23 AM

హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియే షన్(హెచ్‌సీఏ) ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొన్నది. పోలింగ్‌కు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. రెండేండ్ల క్రితం తనకు దక్కకుండా పోయిన అధ్యక్ష పదవి కోసం భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజరుద్దీన్ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోగా, ప్రకాశ్‌చంద్ జైన్, దిలీప్ కుమార్ పోటీనిచ్చేందుకు పావులు కదుపుతున్నారు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల కారణంగా మాజీ అధ్యక్షుడు జీ వివేక్ నామినేషన్ తిరస్కరణకు గురికాగా బరిలో నిలిచిన మరికొంత మంది ఉపసంహరణ చేసుకున్నారు. దీంతో అజర్, జైన్, దిలీప్ మధ్య అధ్యక్ష పదవి కోసం త్రిముఖ పోటీ ఏర్పడింది. అజర్‌కు మాజీ అధ్యక్షుడు అర్షద్ ఆయూబ్, జాన్ మనోజ్ మద్దతు ఇస్తుండగా, జైన్‌కు వివేక్ వర్గం అండదండలు ఉన్నాయి. మరోవైపు టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాతిరి బాబురావు సాగర్ ప్యానెల్ నుంచి దిలీప్ కుమార్ గట్టిపోటీనిచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం వివిధ క్లబ్ కార్యదర్శులతో కలిసి తమ ప్యానెల్‌ను గెలిపించాలని కోరుతూ ప్రచారం కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెచ్‌సీఏ కొంత మంది స్వార్థపరుల వల్ల అనేక అనుమానాలకు గురి అయ్యిందని బాబురావు అన్నారు. శుక్రవారం రాజీవ్‌గాంధీ స్టేడియం వేదికగా హెచ్‌సీఏ ఎన్నికలు జరుగనున్నాయి. అదే రోజు సాయంత్రం కల్లా ఫలితాలు వెల్లడికానున్నాయి.

699
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles