ముంబై ఇండియన్స్‌ - సీఎస్‌కే మ్యాచ్‌కు పటిష్ట భద్రత

Sat,May 11, 2019 11:18 AM

tight security for Mumbai Indians and Chennai Super Kings Match

హైదరాబాద్‌ : నగరంలోని ఉప్పల్‌ స్టేడియంలో ఈ నెల 13వ తేదీన ఐపీఎల్‌-12 ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. ముంబై ఇండియన్స్‌ - చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య జరిగే తుదిపోరు రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ నేపథ్యంలో రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ భద్రతా ఏర్పాట్లపై సమీక్షించి పరిశీలించారు. స్టేడియం పరిసరాల్లో 300 సీసీ కెమెరాలు, 2,800 మంది పోలీసుటతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు మహేశ్‌ భగవత్‌ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాచకొండ సీపీ స్పష్టం చేశారు.

2207
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles