ఇద్దరు కలిసి ఓ క్యాచ్ పట్టారు.. వీడియో

Mon,May 7, 2018 05:02 PM

ఇండోర్: ఐపీఎల్‌లో మరో అద్భుతమైన క్యాచ్ అభిమానులను అలరిస్తున్నది. కింగ్స్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో భాగంగా బౌండరీ దగ్గర ఇద్దరు ఫీల్డర్లు కలిసి క్యాచ్ పూర్తి చేశారు. రాయల్స్ బ్యాట్స్‌మన్ బెన్ స్టోక్స్ కొట్టిన భారీ షాట్‌ను లాంగాఫ్ దగ్గర కళ్లు చెదిరే రీతిలో అందుకున్నాడు మయాంక్ అగర్వాల్. అయితే అంతలోనే బ్యాలెన్స్ తప్పేట్లు కనిపించడంతో లాంగాన్‌లో ఉన్న మనోజ్ తివారీకి బాల్ విసిరేశాడు. అతను ఆ క్యాచ్ అందుకున్నాడు. కీలకమైన సమయంలో స్టోక్స్‌లాంటి హిట్టర్ క్యాచ్ కావడంతో ఇది మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఇప్పటికే ఈ సీజన్‌లో ఎన్నో కళ్లు చెదిరే క్యాచ్‌లు ఉన్నా.. ఇలా ఇద్దరు ఫీల్డర్లు కలిసి పట్టిన క్యాచ్ కావడం ప్రత్యేకంగా నిలుస్తున్నది.


3570
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles