విజయ్ శంకర్ ట్విట్టర్ పోస్టుపై ట్రోల్స్..

Thu,October 17, 2019 10:39 AM

హైదరాబాద్: భారత యువ ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ ట్విట్టర్‌లో చేసిన ఓ పోస్టుపై విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. విజయ్ తన బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్‌ను చూపిస్తూ ఓ ఫోటో ట్విట్టర్‌లో షేర్ చేశాడు. దీంతో విజయ్ అంటే గిట్టని కొందరు నెటిజన్స్ పనిలో పనిగా విజయ్‌ని విమర్శించడం మెదలుపెట్టారు. విజయ్ చేసిన ఈ పోస్టులో శ్రద్దతో చెమటను చిందిస్తున్నాని క్యాప్షన్ పెట్టాడు. శరీరాన్ని మార్చుకునే క్రమంలో బాగా కష్టపడుతున్నట్లు ఆయన తెలిపాడు. కొందరు నెటిజన్స్ మాత్రం ఈ ఫోటోపైభిన్నంగా స్పందించారు. బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ బాగుంది. కానీ, టీమిండియాలో చోటు దక్కించుకొమ్మని సలహా ఇచ్చారు. ఇంకొకతనైతే ముఖంఫై గడ్డం, వితౌట్ షర్ట్ తప్పా నాకు పెద్ద మార్పు కన్పించడం లేదని ట్వీట్ చేశాడు. ముందు ఆట మెరుగుపర్చుకొమ్మనీ, ఈ వేషాలన్నీ తర్వాత చూపించమని మరొకతను ట్వీట్ చేశాడు.


కొసమెరుపేంటంటే.. విజయ్ బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్‌ని భారత ఆటగాళ్లు హార్ధిక్ పాండ్యా, శ్రేయాస్ అయ్యర్ అభినందించారు. వన్డే ప్రపంచకప్‌లో గాయం కారణంగా దూరమైన విజయ్ మళ్లీ టీమిండియాలో చోటు దక్కించుకోలేదు. వరల్డ్‌కప్‌లో 15 మంది సభ్యుల్లో ఒకడిగా స్థానం పొందిన శంకర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. గాయం కారణంగా మధ్యలోనే స్వదేశం తిరిగివచ్చాడు. అంబటి రాయుడి స్థానంలో విజయ్‌ని తీసుకున్న సెలెక్టర్లు అతడు త్రీ డైమెన్షన్ ప్లేయర్ అని తెలిపారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన రాయుడు త్రీడీ కళ్లద్దాలు సిద్దం చేసుకుంటానని సెలెక్టర్లకు కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిదే.1720
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles