విజయ్‌ శంకర్‌ గాయంపై క్లారిటీ ఇచ్చిన టీమిండియా

Sat,May 25, 2019 04:05 PM

Vijay Shankar was hit on his right forearm during practice on Friday

లండన్‌: న్యూజిలాండ్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ నేపథ్యంలో నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తుండగా టీమిండియా ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ గాయపడటంతో ప్రాక్టీస్‌ సెషన్‌ మధ్యలోనే అతడు వెనుదిరిగాడు. శంకర్‌ గాయం తీవ్రతపై టీమిండియా మేనేజ్‌మెంట్‌ శనివారం స్పందించింది. శుక్రవారం సాధన చేస్తుండగా విజయ్‌ శంకర్‌ కుడిచేతికి దెబ్బతగిలింది. దీంతో అతన్ని ఇవాళ హాస్పిటల్‌కు తీసుకెళ్లి.. స్కానింగ్‌ తీయించాం. చేతికి ఫ్రాక్చర్‌ కాలేదని వైద్యులు తెలిపారు. అతడు త్వరగా కోలుకునేందుకు బీసీసీఐ మెడికల్‌ టీమ్‌ అతనికి చికిత్స అందిస్తోంది. అని బీసీసీఐ ట్విటర్‌ వేదికగా పేర్కొంది. శనివారం న్యూజిలాండ్‌తో భారత్‌ తొలి వామప్‌ మ్యాచ్‌లో తలపడుతోంది.

3065
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles