మరికాసేపట్లో మ్యాచ్..అందరి చూపూ శ్రేయాస్‌ పైనే..

Sun,August 11, 2019 04:56 PM

Virat Kohli and Chris Gayle near major records

పోర్ట్ ఆఫ్ స్పెయిన్ : మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానంలో ఆతిథ్య వెస్టిండీస్‌తో రెండో మ్యాచ్‌లో భారత్ ఆదివారం తలపడనుంది. టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన విధంగానే వన్డేల్లోనూ సత్తా చాటాలని కోహ్లీసేన కృత నిశ్చయంతో ఉంది. గురువారం గయానాలోని ప్రావిడెన్స్ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో విండీస్ తొలుత బ్యాటింగ్ చేయగా... 13 ఓవర్లు ముగిసే సరికి వర్షం ఎడతెరిపి లేకుండా పడడంతో ఆ పోరు రద్దయిన విషయం తెలిసిందే. తమ వ్యూహాలు అమలు చేసేందుకు వరుణుడు రెండో వన్డేలోనైనా సహకరించాలని కోహ్లీసేన కోరుకుంటున్నది. సిరీస్‌లో తొలి విజయాన్ని నమోదు చేసి ముందడుగేయాని పట్టుదలతో ఉంది. పరిస్థితులను బట్టి తుది జట్టు కూర్పులోనూ ఒకటి, రెండు మినహా పెద్దమార్పులేమీ ఉండే అవకాశాలు లేవు. నాలుగో స్థానంలో శ్రేయస్ రానుండడం ఖాయంగా కనిపిస్తుండగా.. సైనీ అరంగేట్రంపై ఆసక్తి నెలకొంది. నాలుగో నెంబర్‌లో యువ ఆటగాడు శ్రేయాస్‌ అయ్యర్‌ అంచనాలను అందుకోగలడా అనేది ఆసక్తికరంగా మారింది.

హిట్టర్లే ప్రధాన బలంగా బరిలోకి దిగుతున్న విండీస్‌.. టీ20 పరాభవానికి బదులు తీర్చుకోవాలని ఆశిస్తున్నది. వర్షం కారణంగా తొలి వన్డే రద్దైనప్పటికీ ఆట జరిగినంత సేపు కోహ్లీసేనదే పైచేయిగా కనిపించింది. ఇక వెస్టిండీస్ మాత్రం ఈ సిరీస్‌లో సత్తా చాటి గేల్‌కు ఘన వీడ్కోలు పలకాలని పట్టుదలగా ఉంది. విండీస్‌ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ గేల్‌కు ఇది 300వ వన్డే కావడం విశేషం. వన్డేల్లో విండీస్ తరఫున అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచేందుకు క్రిస్ గేల్ అత్యంత సమీపంలో ఉన్నాడు.

రాత్రి 7 గంటల నుంచి సోనీ టెన్‌–1లో ప్రత్యక్ష ప్రసారం..3443
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles