కోహ్లీసేన.. ప్రాక్టీస్ షురూ!

Fri,October 19, 2018 04:30 PM

హైదరాబాద్: వెస్టిండీస్‌పై టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమ్‌ఇండియా పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌పై దృష్టిసారించింది. టెస్టు సిరీస్ ఏకపక్షంగా సాగినప్పటికీ.. వన్డే సిరీస్‌లో భారత్‌కు కఠిన సవాల్ ఎదురుకానుంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో విండీస్ బ్యాట్స్‌మెన్ చెలరేగి ఆడుతారు. ఈ నేపథ్యంలో కోహ్లీసేన ప్రత్యర్థికి గట్టిపోటీనిచ్చేందుకు సన్నద్ధమవుతోంది. ఆదివారం నుంచే ఆ జట్టుతో ఐదు వన్డేల సిరీస్ ఆరంభంకాబోతోంది. ఆదివారం గువాహటిలో తొలి వన్డే జరగనుంది. శుక్రవారమే టీమ్‌ఇండియా ఆటగాళ్లు స్టేడియంలో ట్రైనింగ్ సెషన్‌కు హాజరయ్యారు. వార్మప్ సెషన్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా తీసిన ఫొటోలను బీసీసీఐ ట్విటర్ పోస్ట్ చేసింది. ఆసియా కప్‌కు విశ్రాంతి తీసుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డే సిరీస్‌తో పునరాగమనం చేయబోతున్నాడు. మహేంద్రసింగ్ ధోనీ, కేఎల్ రాహుల్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ తదితరులతో విరాట్ సాధన చేశాడు.




3161
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles