విరాట్‌.. ఆ షాట్ నువ్వింకా బాగా ఆడ‌గ‌ల‌వు!

Sun,June 11, 2017 12:07 PM

లండ‌న్‌: శ‌్రీలంక‌తో మ్యాచ్ ఓడ‌గానే ఇండియాలో కెప్టెన్ విరాట్ కోహ్లిపై విమ‌ర్శ‌లు బాగానే వ‌చ్చాయి. చాంపియ‌న్స్ ట్రోఫీ ఫేవ‌రెట్ ఇప్పుడు డూ ఆర్ డై ప‌రిస్థితిలో సౌతాఫ్రికాతో ఆడేందుకు రెడీ అయింది. ఓవైపు సొంత ఫ్యాన్స్ తిడుతున్నా.. విరాట్‌కు మాత్రం ఇంగ్లండ్‌లో ఓ కొత్త అభిమాని దొరికాడు. అతను కూడా సాధార‌ణ వ్యక్తి కాదు.. ఇంగ్లిష్ స్టార్ స్నూక‌ర్ ప్లేయ‌ర్ మాథ్యూ సెల్ట్‌. ఆస్ట్రేలియాపై మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన బెన్ స్టోక్స్‌పై విరాట్ ఓ ట్వీట్‌లో ప్ర‌శంస‌లు కురిపించాడు. క‌మిన్స్ బౌలింగ్‌లో స్టోక్స్ ఆడిన షాట్‌.. ఈ మ‌ధ్య కాలంలో బెస్ట్ షాట్ అని విరాట్ ట్వీటేశాడు.


దీనికి మాథ్యూ సెల్ట్ స్పందించాడు. విరాట్ హార్డ్‌కోర్ ఫ్యాన్స్‌ను కూడా ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూ అత‌ను ట్వీట్ చేశాడు. ఈ షాట్ విరాట్ అయితే ఇంకా బాగా ఆడేవాడ‌న్న‌ది సెల్ట్ ట్వీట్ సారాంశం.

1306
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles