కోహ్లి గొప్ప ఆటగాడు: ఆఫ్రిది

Thu,September 19, 2019 12:47 PM

మొహాలీ: భారత్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి గొప్ప ఆటగాడని పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ ఆఫ్రిది అన్నాడు. నిన్న దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ-20లో విరాట్‌ అర్ధసెంచరీ(72)తో ఇండియాను గెలిపించిన విషయం తెలిసిందే. ఈ ఇన్నింగ్స్‌తో విరాట్‌ టీ-20 ఫార్మాట్‌లో 50+ సగటును నమోదు చేశాడు. ఇంతకు ముందే వన్డేల్లో(60.31), టెస్టుల్లో(53.14) యాబైకి పైగా సగటును కలిగియున్నాడు. ఈ మ్యాచ్‌తో టీ-20ల్లో సైతం 50+ సగటు నమోదు చేసి కొత్త రికార్డు సృష్టించాడు. అన్ని ఫార్మాట్స్‌లో యాబైకి పైగా సగటు(యావరేజి) నమోదు చేసిన ఏకైక క్రికెటర్‌ కోహ్లి అని ఐసీసీ ట్విట్టర్‌ ద్వారా ప్రశంసించిన విషయం విదితమే.


ఈ ట్వీట్‌ని రీట్వీట్‌ చేసిన ఆఫ్రిది.. కోహ్లి నీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నువ్వు గొప్ప ఆటగాడివి, నీ సక్సెస్‌ను ఇలాగే కొనసాగించు, ప్రంపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులను ఇలాగే అలరించాలని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

కాగా, ఈ మ్యాచ్‌తో కోహ్లి టీ-20ల్లో అత్యధిక పరుగులు(2,441పరుగులు) సాధించిన ఆటగాడిగా రోహిత్‌ శర్మ రికార్డు బద్దలు కొట్టాడు. అట్లాగే టీ20ల్లో అత్యధిక అర్ధసెంచరీలు(22) సాధించిన ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌తో ఇండియా మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. మొదటి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. మూడో మ్యాచ్‌ 22న బెంగళూరులో జరుగనుంది.

2393
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles