కోహ్లి, సెలెక్టర్ల చేతిలో ధోని భవితవ్యం: గంగూలీ

Tue,September 17, 2019 04:27 PM

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని భవిష్యత్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, సెలెక్లర్ల చేతిలో ఉందని అన్నాడు మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ. ధోని ఎంతటి కీలక ఆటగాడో అతడి రికార్డులే చెబుతాయి. బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా టీమ్‌కు అదనపు భరోసా ధోని అని అతనన్నాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత ధోని అంతంత మాత్రంగానే రాణిస్తున్నాడు. అప్పుడప్పుడు కీలక ఇన్నింగ్స్‌లు ఆడినా అంతగా ఆకట్టుకోవడం లేదు. మునుపటి చురుకుదనం లోపించింది. భారీ షాట్‌లు ఆడలేకపోతున్నాడు.


ధోని చివరిసారి ఇండియా తరఫున 2019 వరల్డ్‌కప్‌లో ఆడాడు. ఆ టోర్నీలో ధోని తీవ్రంగా నిరాశపర్చాడు. ప్రపంచకప్‌ తర్వాత అతను క్రికెట్‌కు వీడ్కోలు చెబుతాడని అందరూ భావించినా తన నిర్ణయం ప్రకటించలేదు ధోని. వరల్డ్‌కప్‌ తర్వాత భారత్‌ పర్యటించిన విండీస్‌ టూర్‌కు అతను ఎంకికవ్వలేదు. అతనికి ప్రత్యామ్నయంగా రిషభ్‌ పంత్‌ను టీమ్‌లోకి బీసీసీఐ ఎంపిక చేసింది. ప్రస్తుతం స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ-20 సిరీస్‌కు సైతం అతను సెలెక్ట్‌ కాని విషయం తెలిసిందే. వరల్డ్‌ కప్‌ తర్వాత ధోని ఇండియన్‌ ఆర్మీలో కొన్ని రోజులు విధులు నిర్వహించాడు.

కాగా, అతడి క్రికెట్‌ భవిష్యత్‌పై గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. నాకు తెలిసి ధోని టీమిండియాలో మళ్లీ ఆడాలంటే కెప్టెన్‌ విరాట్‌, సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాలని అన్నాడు. గంగూలీ ప్రస్తుతం బెంగాల్‌ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడిగా, ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు సలహాదారుడిగా పని చేస్తున్నారు.

1766
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles