విరాట్ మా దేశంలో క్రికెట్ ఆడరూ..

Thu,October 10, 2019 12:56 PM

లాహోర్: పాకిస్తాన్ క్రికెట్ ప్రేమికుడు షాహబాజ్ షరీఫ్ ఖాస్మీ.. ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి వీరాభిమాని. విరాట్ కోహ్లి దయచేసి మా దేశంలో క్రికెట్ ఆడాలని ఆశిస్తున్నానని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఈ ట్వీట్ క్రికెట్ ప్రేమికులనెంతగానో ఆకట్టుకుంటోంది. దాదాపు దశాబ్ద కాలానికి పైగా విరామం తర్వాత ఇటీవలే పాకిస్తాన్‌లో శ్రీలంక పర్యటించిన విషయం తెలిసిందే. మూడు టీ-20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా అన్ని మ్యాచ్‌లు లాహోర్‌లోని గఢాఫీ స్టేడియంలో జరిగాయి. ఈ సిరీస్‌లో పాకిస్తాన్ శ్రీలంక చేతిలో చిత్తుగా ఓడింది. 0-3తో లంకకు సిరీస్‌ను కోల్పోయింది.


కాగా, లంకతో జరిగిన చివరి మ్యాచ్‌లో విరాట్ వీరాభిమాని ప్రదర్శించిన ఓ ఫ్లకార్డు క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది. విరాట్ దయచేసి పాక్‌లో మీరు క్రికెట్ ఆడాలని మేము కోరుకుంటున్నామని ఆ అభిమాని ఫ్లకార్డు ద్వారా తెలియజేశాడు. భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లికి భారత్‌లోనే గాక ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.

అతని ఆటతీరుకు ముగ్దులు కాని క్రికెట్ ప్రేమికులుండరంటే అతిశయోక్తి కాదు. ఆటపై అతని అంకితభావం, శారీరక దృఢత్వం ప్రపంచ యువతకు స్ఫూర్తిదాయకం అనడంలో సందేహం లేదు. కాగా, పాక్ దేశస్తుడు, విరాట్ అభిమాని ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఈ ఫోటోపై చాలా లైకులు రాగా, చాలా మంది రీట్వీట్ చేస్తున్నారు.

3521
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles