వెస్టిండీస్ కెప్టెన్‌గా పొలార్డ్..!

Mon,September 9, 2019 03:44 PM

westindies captain will kieron pollard

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: ఒకప్పటి విండీస్ జట్టు ఎంత భీకరంగా ఉండేదో రికార్డులే చెబుతాయి. కానీ, రాన్రాను విండీస్ క్రికెట్ దిగజారుతోంది. విదేశీ లీగుల్లో వ్యక్తిగతంగా అదరగొడుతున్న ఈ కరీబియన్ స్టార్స్ జట్టుగా మాత్రం అస్సలు రాణించడం లేదు. ఒకానొక దశలో వన్డే వరల్డ్‌కప్ కోసం క్వాలిఫయర్ మ్యాచ్‌లాడే స్థితికి చేరుకుంది. జట్టులో హేమాహేమీలున్నప్పటికీ విజయాలు మాత్రం దరిచేరడం లేదు. ఈ మధ్యే ఇండియాతో జరిగిన అని ఫార్మాట్స్‌లో ఘోర పరాజయం పాలైంది.

ఈ క్రమంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు జట్టు మార్పు, కెప్టెన్ తదితర అంశాలపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. వన్డే, టీ-20 ఫార్మాట్లలో ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్‌కు కెప్టెన్‌గా భాద్యతలు అప్పగించే అవకాశం ఉంది. ప్రస్తుతం జేసన్ హోల్డర్ విండీస్ వన్డే జట్టుకు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. అతని నేతృత్వంలో జట్టు విజయాల సంఖ్య ఘోరంగా ఉంది. దీంతో కెప్టెన్ మార్పు తథ్యమని తెలుస్తోంది.

1340
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles