టీమిండియా క్రీడాస్ఫూర్తి..మనసులు గెలిచారు: వీడియో

Sat,June 16, 2018 10:53 AM

బెంగళూరు: ఆతిథ్య భారత్ జట్టుతో చరిత్రాత్మక టెస్టు మ్యాచ్‌లో అఫ్గనిస్థాన్ ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. పరిమిత ఓవర్ల క్రికెట్లో సత్తాచాటిన అఫ్గాన్.. సంప్రదాయ టెస్టులో ఒకే రోజు రెండుసార్లు ఆలౌటైంది. అన్ని రంగాల్లో సమష్టిగా రాణించిన టీమిండియా ఇన్నింగ్స్ 262 పరుగులతో భారీ విజయం సాధించింది. మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసింది. మ్యాచ్ అనంతరం చోటుచేసుకున్న ఓ దృశ్యం అందరినీ ఆకట్టుకుంది.


చారిత్రక టెస్టులో విజయం సాధించిన భారత్ క్రీడాస్ఫూర్తిలోనూ పైచేయి సాధించింది. ట్రోఫీ అందుకొన్న భారత్ ఆటగాళ్లు ఫొటోకు పోజు ఇచ్చారు. అనంతరం అక్కడే ఉన్న అఫ్గాన్ ఆటగాళ్లను సాదరంగా ఆహ్వానించి వాళ్లతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ఈ సందర్భంగా తాత్కాలిక కెప్టెన్ రహానె ఒక్క అడుగు ముందుకేసి ప్రత్యర్థి ఆటగాళ్ల భుజాలపై చేయివేసి మరీ తీసుకొచ్చాడు. ట్రోఫీతో ఇరుజట్ల ఆటగాళ్లు మరోసారి ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా స్టేడియంలో ఉన్న అభిమానులు ఇరుదేశాల జాతీయ పతాకాలను ఊపుతూ సంతోషం వ్యక్తం చేశారు. టీమిండియా క్రీడా స్ఫూర్తికి క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.



3041
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles