వరల్డ్‌కప్ తర్వాత యువరాజ్ రిటైర్మెంట్!

Mon,April 23, 2018 12:48 PM

Will take a call on my career after 2019 World Cup says Yuvraj Singh

ముంబై: టీమిండియా ైస్టెలిష్ బ్యాట్స్‌మన్ యువరాజ్‌సింగ్ వచ్చే ఏడాది వరల్డ్‌కప్ తర్వాత తన కెరీర్‌పై ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పాడు. గతేడాది జూన్‌లో టీమిండియా తరఫున చివరి వన్డే ఆడిన యువీ.. తర్వాత ఫామ్ కోసం తంటాలు పడుతున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో కింగ్స్ పంజాబ్ తరఫున ఆడుతున్నా ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. 2019 వరకు ఆడాలనుకుంటున్నా. ఆ తర్వాత నా కెరీర్‌పై తుది నిర్ణయం తీసుకుంటా అని యువీ చెప్పాడు. రెండు దశాబ్దాలుగా టీమిండియాకు ఆడుతున్నా.. ఏదో ఒక రోజు రిటైర్ కావాల్సిందే కదా అని అన్నాడు.

2000 ఏడాది నుంచి యువీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నాడు. అదే ఏడాది అండర్ 19 వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత యువీతోపాటు మహ్మద్ కైఫ్ కూడా సీనియర్ టీమ్‌కు ఎంపికయ్యారు. ఇక కింగ్స్ పంజాబ్ టీమ్ గురించి మాట్లాడుతూ.. సెమీఫైనల్ చేరడమే తమ తొలి లక్ష్యమని యువీ చెప్పాడు. టాప్ ఫామ్‌లో ఉన్న క్రిస్ గేల్‌పై ప్రశంసలు కురిపించాడు. ఫీల్డ్ బయట కూడా గేల్ నాకు మంచి ఫ్రెండ్. ప్రపంచంలోని డేంజరస్ బ్యాట్స్‌మెన్‌లో గేల్ ఒకడు. ఫీల్డ్‌లో ఓ బాస్‌లాగా ఆడుతున్నాడు అని యువీ అన్నాడు. ఈ ఏడాది తమ ప్రధాన ప్రత్యర్థులు చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ అని అభిప్రాయపడ్డాడు.

3059
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles