కేన్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌.. బెంగళూరు టార్గెట్ 176

Sat,May 4, 2019 09:52 PM

Williamson Half-century Helps SRH end at 175

బెంగళూరు: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మెరుగైన స్కోరు సాధించింది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌(70నాటౌట్‌: 43 బంతుల్లో 5ఫోర్లు, 4సిక్సర్లు) రాణించడంతో 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగులు చేసింది. ఓపెనర్లు మెరుపు ఆరంభం ఇచ్చినప్పటికీ వీరిద్దరు ఔటైన తర్వాత వరుస విరామాల్లో సన్‌రైజర్స్‌ వికెట్లు కోల్పోయింది. స్కోరు వేగం తగ్గినా.. ఉమేశ్‌ యాదవ్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో విలియమన్స్‌ వీరవిహారం చేశాడు. వరుసగా 6,4,6,4 బాది స్కోరు బోర్డును 170 దాటించాడు. ఇదే ఓవర్‌లో అర్థశతకం కూడా పూర్తి చేసుకున్నాడు. ఓవర్‌ చివరి బంతిని భువనేశ్వర్‌(7) ఫోర్‌ బాదడంతో ఆ ఓవర్‌లో మొత్తం 28 పరుగులు వచ్చాయి. మిడిల్‌ ఓవర్లలో బెంగళూరు ధాటిగా బౌలింగ్‌ చేసింది. సన్‌రైజర్స్‌ జోరుకు మధ్యమధ్యలో బ్రేకులు వేస్తూ.. స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేయకుండా అడ్డుకున్నారు. ఐతే భారీ స్కోరు సాధించే క్రమంలో దూకుడుగా ఆడి స్వల్ప విరామాల్లో హైదరాబాద్‌ వికెట్లు చేజార్చుకుంది. వృద్ధిమాన్‌ సాహా(20), మార్టిన్‌ గప్తిల్‌(30), విజయ్‌ శంకర్‌(27) చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశారు. బెంగళూరు బౌలర్లలో వాషింగ్టన్‌ సుందర్‌(3/24), నవ్‌దీప్‌ సైనీ(2/39) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. చాహల్‌, కేజ్రోలియా చెరో వికెట్‌ తీశారు.

3737
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles