వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌తో ఇండియా ఆడుతుందా? లేదా?

Mon,February 18, 2019 04:39 PM

With out Governments Nod will not play against Pakistan Says IPL Chairman Rajeev Shukla

ముంబై: ప్రస్తుతం ఇండియా, పాకిస్థాన్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాక్‌కు వ్యతిరేకంగా దేశమంతా రగిలిపోతున్నది. ఈ నేపథ్యంలో రానున్న క్రికెట్ వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌తో టీమిండియా ఆడుతుందా లేదా అన్న ప్రశ్న తలెత్తుతున్నది. దీనిపై ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా స్పందించారు. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వరకు పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. మరి వరల్డ్‌కప్ మ్యాచ్ సంగతేంటి అని అడిగితే.. దానిపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని అన్నారు. మేము చాలా స్పష్టతతో ఉన్నాం. ప్రభుత్వం అనుమతించే వారకు పాకిస్థాన్‌తో ఆడే ప్రసక్తే లేదు. నిజానికి క్రీడలు వీటన్నింటికీ అతీతం కావాలి. కానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న వాళ్లతో క్రీడలపైనా ఆ ప్రభావం పడుతుంది అని శుక్లా అన్నారు. వరల్డ్‌కప్ మ్యాచ్‌పై స్పందిస్తూ.. అది ఇప్పటికిప్పుడు నేను చెప్పలేను. వరల్డ్‌కప్ ఇంకా చాలా దూరం ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం అని ఆయన చెప్పారు. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మిన్నంటుతున్న నిరసనలు శుక్లా సమర్థించారు. ప్రజల ఆక్రోశం సమంజసమే. పాకిస్థాన్ ఈ విషయం తెలుసుకోవాలి. మొదటి నుంచీ ఇదే చెబుతున్నాం. మేము ప్రభుత్వంలో ఉన్నపుడు పాకిస్థాన్ పాత్రను నిరూపించే ఎన్నో పత్రాలను అందించాం. వాళ్లు అది తెలుసుకోవాలి అని కాంగ్రెస్ పార్టీకి చెందిన శుక్లా చెప్పారు.


2478
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles