వ‌ర‌ల్డ్ బాక్సింగ్‌.. చ‌రిత్ర సృష్టించిన మేరీకామ్‌

Thu,October 10, 2019 12:25 PM

హైద‌రాబాద్‌: బాక్స‌ర్ మేరీకామ్ చ‌రిత్ర సృష్టించింది. ప్రపంచ మ‌హిళ‌ల‌ బాక్సింగ్ చాంపియ‌న్‌షిప్‌లో మ‌రో ప‌త‌కాన్ని ఆమె ఖ‌రారు చేసుకున్న‌ది. ర‌ష్యాలోని ఉల‌న్ ఉడేలో జ‌రుగుతున్న టోర్న‌మెంట్‌లో.. మేరీకామ్ సెమీస్‌కు చేరుకున్న‌ది. మ‌ణిపూర్ బాక్స‌ర్ మేరీ.. ఈ సారి మెగా ఈవెంట్‌లో 51 కిలోల కేట‌గిరీలో పోటీప‌డుతున్న‌ది. ఇవాళ జ‌రిగిన మ్యాచ్‌లో మేరీ 5-0 తేడాతో థాయిలాండ్‌కు చెందిన జుటామ‌స్ జిట్‌పాంగ్‌పై నెగ్గి సెమీస్‌కు చేరుకున్న‌ది. దీంతో మేరీకి మ‌రో ప‌త‌కం ఖాయ‌మైంది. ఇప్ప‌టివ‌ర‌కు వ‌ర‌ల్డ్ వుమెన్స్ చాంపియ‌న్‌షిప్‌లో మేరీ ఏడు ప‌త‌కాలు గెలుచుకున్న‌ది. సెమీస్‌లో ఓడినా ప‌త‌కం ఖాయం కావ‌డం వ‌ల్ల‌.. వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌షిప్‌లో మేరీ గెలుచుకున్న మొత్తం ప‌త‌కాల సంఖ్య ఎనిమిదికి చేరుకోనున్న‌ది. ఇది టోర్న‌మెంట్ చ‌రిత్ర‌లోనే రికార్డుగా నిల‌వ‌నున్న‌ది. శ‌నివారం జ‌రిగే సెమీస్ పోరులో ట‌ర్కీకి చెందిన రెండ‌వ సీడ్ బుసేనాజ్ కాకిరోగ్లూతో మేరీ త‌ల‌ప‌డనున్న‌ది. వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌షిప్‌లో మేరీ.. గ‌తంలో ఆరు స్వ‌ర్ణ‌, ఒక సిల్వ‌ర్ ప‌త‌కం గెలుచుకున్న‌ది.


2888
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles