తండ్రి కాబోతున్న యువరాజ్‌సింగ్!

Fri,December 14, 2018 11:51 AM

Yuvraj and Hazel Keech expecting their first child soon

ముంబై: క్రికెటర్ యువరాజ్‌సింగ్ తండ్రి కాబోతున్నాడు. రెండేళ్ల కిందట బాలీవుడ్ నటి హేజెల్ కీచ్‌ను యువీ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ జంట తమ తొలి సంతానాన్ని త్వరలోనే పొందబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్ పెళ్లికి ఈ జంట హాజరైంది. అక్కడికి వచ్చిన అతిథులు ఇదే విషయాన్ని యువీ, కీచ్ జంటను అడిగినట్లు ముంబై మిర్రర్ పత్రిక వెల్లడించింది. పెళ్లిలో యువీతో కలిసి దిగిన ఫొటోను హేజెల్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. అదే రోజు యువీ బర్త్ డే కూడా కావడం విశేషం. 2016, నవంబర్ 30న యువరాజ్, హేజెల్ కీచ్ పెళ్లితో ఒకటైన విషయం తెలిసిందే. ఆ రోజు సిక్కు సంప్రదాయంలో పెళ్లి చేసుకున్న ఈ జంట.. డిసెంబర్ 2న గోవాలో హిందూ సాంప్రదాయం ప్రకారం మరోసారి ఏడు అడుగులు వేశారు. ఈ పెళ్లికి అప్పటి లవ్ బర్డ్స్ కోహ్లి, అనుష్క కూడా హాజరయ్యారు.

1747
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles