ఈ బ్యాట్స్‌మన్ ఔటా కాదా.. వీడియో చూసి మీరే చెప్పండి!

Tue,November 14, 2017 04:38 PM

Yuvraj Shares a video of Strange dismissal in cricket

న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. అది ఓ క్రికెట్ మ్యాచ్ వీడియో. ఓ బౌలర్ బాల్ వేస్తాడు. బ్యాట్స్‌మన్ దానిని వదిలిపెడతాడు. వెనకాల ఉన్న వికెట్ కీపర్ బాల్ అందుకుంటాడు. సడెన్‌గా అంపైర్ వేలు పైకెత్తి ఔటైనట్లు చెబుతాడు. బ్యాట్స్‌మన్ కామ్‌గా వెళ్లిపోతాడు. అసలు అతనెలా ఔటో తెలియక ఈ వీడియో చూసిన జనాలు తల పట్టుకుంటున్నారు. యువీ పోస్ట్ చేసిన ఆ వీడియో మీరూ ఓ సారి చూసి అది ఔటా కాదా చెప్పండి.

🤔🤔🤔

A post shared by Yuvraj Singh (@yuvisofficial) on


చూశారు కదా.. అసలు బాల్ బ్యాట్‌కి అంత దూరంగా వెళ్లినా అంపైర్ ఎలా ఔటిచ్చాడు? ఈ ప్రశ్న మిమ్మల్నీ వేధిస్తున్నదా? అయితే దీనికి ఓ స్టాటిస్టియన్ సమాధానమిచ్చాడు. మోహన్‌దాస్ మీనన్ అనే వ్యక్తి అదెలా ఔటో ట్విట్టర్‌లో చెప్పాడు. ఇది 2007లో జరిగిన ఓ చారిటీ మ్యాచ్ అని, ఆ మ్యాచ్ నిబంధనల ప్రకారం ఒక ఓవర్లో ఓ బ్యాట్స్‌మన్ కొట్టగలిగిన బంతులను కూడా వరుసగా రెండుసార్లు వదిలేస్తే ఔట్‌గా ప్రకటించే అవకాశం అంపైర్‌కు ఉంటుందని ఆయన చెప్పారు. క్రికెట్‌లో ఇలాంటి రూల్స్ ఎప్పుడూ చూడలేదే అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

3853
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles