ఆ అకాడమీపై విమర్శలా?: యువరాజ్ సింగ్

Sat,July 21, 2018 06:23 PM

Yuvraj Singh backs NCA, says BCCI facilities helped him bounce back from cancer

న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆధ్వర్యంలోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)పై వస్తున్న విమర్శలను టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ యువరాజ్‌సింగ్ ఖండించాడు. ఆటగాళ్లు తిరిగి ఫిట్‌నెస్, ఫామ్ సాధించడంలో అకాడమీ ఎనలేని పాత్రపోషిస్తోందని ప్రశంసించాడు. వేలి గాయం నుంచి కోలుకునేందుకు వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ వృద్ధిమాన్ సాహా ఎన్‌సీఏలో ఫిజియోల పర్యవేక్షణలో శిక్షణ తీసుకున్నాడు. ఈ క్రమంలోనే అతని భుజం గాయం తిరగబెట్టి తీవ్రమైందని, దీనికి ఎన్‌సీఏ, ఫిజియోలు కారణమని విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో యువీ స్పందించాడు.

క్యాన్సర్ చికిత్స చేయించుకున్న తరువాత తాను మళ్లీ మైదానంలో అడుగుపెట్టడానికి సాయపడింది అకాడమీనే. ఎన్‌సీఏపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో నేను నా అనుభవాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. నేను క్రికెట్‌లోకి పునరాగమనం చేయడానికి అకాడమీ ఎంతో సాయపడింది. అత్యున్నత సౌకర్యాలతో బీసీసీఐ నెలకొల్పిన అకాడమీలో ఆటగాళ్లు గాయాల నుంచి కోలుకోవడానికి ఉపయోగపడుతోంది. దేశంలోనే అత్యుత్తమ ప్రతిభ కలిగిన ఫిజియోలు, ట్రైనర్లు ఇందులో ఉన్నారని యువీ ట్విటర్ ద్వారా పేర్కొన్నాడు.3349
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles