కనీస ధర రూ.2 కోట్ల జాబితాలో ఒక్క భార‌త క్రికెట‌ర్ లేడు!

Wed,December 12, 2018 03:42 PM

Yuvraj Singh enters the upcoming auctions

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్‌-12లో ఆడేందుకు 1,003 మంది క్రికెటర్లు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తం 8 జట్లకు కలిపి 70 మంది క్రికెటర్లను వేలంలో ఆయా ఫ్రాంఛైజీలు ఎంపిక చేసుకోనున్నారు. ఈనెల 18న జైపూర్‌లో వేలం జరగనున్న విష‌యం తెలిసిందే. ఈ వేలంలో ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌, సీనియ‌ర్ పేస‌ర్ మహమ్మద్ షమీ తమ కనీస ధరను రూ. కోటిగా నిర్ణయించారు. గ‌త సీజ‌న్‌లో యువ‌రాజ్‌సింగ్‌ను కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్ కొనుగోలు చేసిన విష‌యం తెలిసిందే. గతేడాది వేలంలో రూ.11.5 కోట్లతో అత్యధిక ధర పలికిన యువ పేసర్ జ‌య‌దేవ్‌ ఉనద్కత్‌ ఈ సారి కనీస ధర రూ.1.5 కోట్లతో బరిలో దిగుతున్నాడు.

అత్యధిక కనీస ధర రూ.2 కోట్ల జాబితాలో భారత ఆటగాడు ఒక్క‌రు కూడా లేరు. విదేశీ టీ20 స్పెష‌లిస్టులు మెక్‌కలమ్‌, క్రిస్‌ వోక్స్‌, మలింగ, షాన్‌ మార్ష్‌, కొలిన్‌ ఇంగ్రామ్‌, కోరె అండర్సన్‌, ఏంజెలో మాథ్యూస్‌, సామ్‌ కరన్‌, షార్ట్‌ తమ కనీస ధరను రూ.2 కోట్ల‌తో వేలంలో పాల్గొన‌బోతున్నారు. బౌల‌ర్ ఇషాంత్‌ శర్మ, వికెట్ కీప‌ర్ బ్యాట్స్‌మ‌న్ నమన్‌ ఓజా కనీస ధర రూ.75 లక్షలు కాగా.. టెస్టు స్పెష‌లిస్ట్‌ పుజారా, మనోజ్‌ తివారి, హనుమ విహారి, గుర్‌కీరత్‌ సింగ్‌, మోహిత్‌ శర్మ కనీస ధర రూ.50 లక్షలతో వేలంలోకి వ‌స్తున్నారు. 2019 ఐపీఎల్ ముగిసిన వెంట‌నే ప్ర‌తిష్టాత్మ‌క ప్ర‌పంచ‌క‌ప్ ఆరంభంకానున్న నేప‌థ్యంలో ఆయా దేశాలు అగ్ర‌శ్రేణి ఆట‌గాళ్ల‌ను ఐపీఎల్‌లో ఆడించేందుకు నిరాక‌రించే అవ‌కాశం ఉంది.

3910
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles