యువరాజ్ సింగ్ రివర్స్ స్వీప్ సిక్స్ చూశారా.. వీడియో

Tue,February 19, 2019 12:15 PM

ముంబై: టీమిండియా క్రికెటర్ యువరాజ్‌సింగ్‌కు సిక్సర్ల కింగ్‌గా పేరుంది. ఈ ైస్టెలిష్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఎంతో ఈజీగా సిక్సర్లు బాదడంలో దిట్ట. చాలా రోజులుగా టీమ్‌కు దూరంగా ఉండటంతో ఈ మధ్య యువీ ైస్టెలిష్ బ్యాటింగ్‌ను చూసే అవకాశం అభిమానులకు దక్కలేదు. అయితే తాజాగా ఓ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో ఈ సిక్సర్ల కింగ్ కొట్టిన ఓ సొగసైన సిక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. తన ైస్టెల్‌కు విరుద్ధంగా అతడు రివర్స్ స్వీప్‌లో సిక్స్ బాదడం విశేషం. ఎయిరిండియా, మాల్దీవ్స్ క్రికెట్ టీమ్ మధ్య మాలెలో జరిగిన ఓ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో యువీ ఈ షాట్ కొట్టాడు. మాల్దీవ్స్ స్పోర్ట్స్ మినిస్ట్రీ, ఇండియన్ ఎంబసీ, మాల్దీవ్స్ క్రికెట్ బోర్డు సంయుక్తంగా ఆర్గనైజ్ చేసిన ఈ మ్యాచ్‌లో ఎయిరిండియా తరఫున యువీ బరిలోకి దిగాడు. ఈ షాట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే అది వైరల్‌గా మారిపోయింది. మాల్దీవ్స్ టీమ్‌లో ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం మొహ్మద్, ఉపాధ్యక్షుడు ఫైజల్ నసీమ్ కూడా ఉండటం విశేషం. యువరాజ్ టీమిండియా తరఫున 2017, జూన్ 30న చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. అదే ఏడాది ఫిబ్రవరి 1న చివరి టీ20 మ్యాచ్‌లో కనిపించాడు. ఆ తర్వాత ఐపీఎల్ సహా దేశవాళీ క్రికెట్‌లో ఆడుతున్నాడు.
2371
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles