క్యాన్సర్ బాధిత చిన్నారిని కలిసిన యువరాజ్

Fri,May 11, 2018 04:43 PM

Yuvraj Singh meets a 11 year old boy suffering from cancer

న్యూఢిల్లీ:స్టైలిష్‌ బ్యాట్స్‌మన్ యువరాజ్‌సింగ్ సక్సెస్ స్టోరీ తెలిసిందే. క్యాన్సర్ మహమ్మారితో పోరాడి గెలిచిన యువీ.. తర్వాత మళ్లీ క్రికెట్ ఫీల్డ్‌లో అడుగుపెట్టడం ఎంతోమందికి ప్రేరణ కలిగించేదే. అలాంటి యువరాజ్.. ఇప్పుడు ఓ క్యాన్సర్ బాధిత చిన్నారిని కలిసి అతనిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. 11 ఏళ్ల రాకీ అనే ఆ బాలుడు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. అతనితో కాసేపు గడిపి కింగ్స్ పంజాబ్ టీమ్ సభ్యులు సంతకాలు చేసిన జెర్సీతోపాటు క్యాప్ అందించాడు. ఈ ఫొటోలను ఆ టీమ్ తమ ట్విట్టర్‌లో షేర్ చేసింది. యువీని సోషల్ మీడియా పొగడ్తల్లో ముంచెత్తింది.


2011 వరల్డ్‌కప్ టీమిండియా గెలవడంలో యువరాజ్‌దే కీలకపాత్ర. మ్యాన్ ఆఫ్ ద టోర్నీగా కూడా అతడు నిలిచాడు. ఆ వెంటనే అతని ఊపిరితిత్తుల్లో గోల్ఫ్ బాల్ సైజులో ట్యూమర్ ఉన్నట్లు గుర్తించారు. కీమోథెరపీ తీసుకొని క్యాన్సర్‌ను జయించిన తర్వాత యువీ మళ్లీ క్రికెట్ ఆడుతున్నాడు.

2075
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles