యువ‌రాజ్‌ సింగ్‌ ప్రాక్టీస్‌ ఇలా..:వీడియో

Fri,March 15, 2019 02:23 PM

Yuvraj singh practice match videos

ముంబై: టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ మళ్లీ మైదానంలోకి వ‌చ్చేశాడు. వ‌చ్చే ఐపీఎల్ సీజ‌న్‌లో అభిమానులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. మార్చి 23 నుంచి ఐపీఎల్‌-12 సీజ‌న్ మ్యాచ్‌లు ఆరంభంకానున్నాయి. వాంఖడే వేదికగా మార్చి 24న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబయి ఇండియన్స్‌ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఈ నేప‌థ్యంలో ముంబ‌యి ఆట‌గాళ్లు ప్రాక్టీస్ మొద‌లెట్టారు. ఆ జ‌ట్టు ఆట‌గాడు యువరాజ్ సింగ్‌ బ్యాటింగ్ సాధ‌న చేస్తుండ‌గా తీసిన‌ వీడియోను ముంబయి ఇండియన్స్ ట్విట‌ర్‌లో పోస్ట్ చేసింది.


ఐపీఎల్-2019 సీజన్ కోసం గత ఏడాది చివర్లో వేలం నిర్వ‌హించ‌గా కనీస ధర రూ. కోటితో వేలంలోకి వచ్చిన యువరాజ్ సింగ్‌ను ఫ్రాంఛైజీలు కొనుగోలు చేసేందుకు తొలుత ఆసక్తి చూప‌లేదు. ఫ‌స్ట్ రౌండ్‌లో అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో నిలిచిన ఆల్‌రౌండర్‌ని వేలం ఆఖర్లో ముంబయి కనీస ధరకే కొనుగోలు చేసింది.


2404
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles