దీపావళికి పటాకులు కాల్చొద్దుగానీ.. నీ పెళ్లికి మాత్రం ఓకేనా?

Sun,October 15, 2017 01:40 PM

న్యూఢిల్లీ: పటాకులపై ఈ ఏడాది జరిగినంత చర్చ ఎప్పుడూ జరగలేదేమో. ఈసారి దీపావళికి ఢిల్లీలో పటాకుల అమ్మకాన్ని సుప్రీంకోర్టు నిషేధించినప్పటి నుంచి సోషల్ మీడియాలో దీనిపై విపరీతంగా చర్చ నడుస్తున్నది. కొందరు కోర్టు తీర్పును తప్పుబట్టగా.. మరికొందరు సమర్థిస్తున్నారు. తాజాగా క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా ఈ దీపావళికి పటాకులు కాల్చొద్దంటూ పొల్యూషన్ ఫ్రీ దివాళీ పేరుతో ట్విట్టర్‌లో సందేశం ఇచ్చాడు. దేశంలో కాలుష్యం పెరిగిపోతున్నదని, దయచేసి ఎవరూ ఈ పండుగకు పటాకులు కాల్చొద్దని అతను చెప్పాడు. స్వీట్లు తినండి, పత్తాలు ఆడండి, ఎంజాయ్ చేయండి కానీ పటాకులు మాత్రం వద్దంటూ కోరాడు.


అయితే దీనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. అతని పెళ్లి సమయంలోని ఓ ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. నీ పెళ్లికి కాలిస్తే కాలుష్యం కాదా అంటూ యువీని ప్రశ్నించారు. కేవలం దీపావళి రోజున కాలిస్తేనే కాలుష్యం వస్తుందా అంటూ అతన్ని కడిగి పారేశారు.


మరోవైపు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం.. ఈ దీపావళినాడు బాంబుల మోతతో దద్దరిల్లాలి అని ట్వీట్ చేయడం విశేషం.

3552
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles