క్రిస్‌గేల్ సెంచరీ.. యువీ గంగ్నం డ్యాన్స్: వీడియో

Fri,April 20, 2018 03:22 PM

Yuvraj Singhs epic dance celebrating Chris Gayles blazing century

మొహాలీ: ఐపీఎల్-11లో భాగంగా గురువారం మొహాలీలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓపెనర్, కరీబియన్ సుడిగాలి క్రిస్‌గేల్(104 నాటౌట్: 63 బంతుల్లో 1ఫోరు, 11సిక్సర్లు) మెరుపు సెంచరీ బాదిన విషయం తెలిసిందే. టీ20 క్రికెట్‌లో క్రిస్‌గేల్‌కు ఇది 21వ శతకం కావడం విశేషం. గేల్ చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 3 వికెట్లకు 193 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ 4 వికెట్లకు 178 పరుగులే చేయగలిగింది. దీంతో పంజాబ్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది.

పంజాబ్ ఇన్నింగ్స్‌లో గేల్ సెంచరీ పూర్తి చేయడంతో అందరికన్నా ఎక్కువ సంతోష పడింది మాత్రం ఆ జట్టు ఆటగాడు యువరాజ్‌సింగ్. మైదానంలో తనదైన శైలిలో గేల్ సంబరాలు చేసుకుంటే.. డగౌట్‌లో ఉన్న యువీ ఫేమస్ డ్యాన్స్ గంగ్నం స్టెల్ డ్యాన్స్‌తో ఆకట్టుకున్నాడు. గేల్ సునామీకి తన డ్యాన్స్‌తో అభినందనలు తెలిపాడు. ఇది చూసిన ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకున్నారు. ఇన్నింగ్స్ పూర్తయిన తరువాత సహచర, ప్రత్యర్థి ఆటగాళ్లు ప్రత్యేక అభినందనలు తెలిపారు. డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్తున్న గేల్‌కు అభిమానులు చప్పట్లతో స్వాగతం పలికారు.
3071
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles