కోర్టులో పెళ్లి చేసుకున్న క్రికెటర్!

Thu,November 23, 2017 12:26 PM

Zaheer Khan and Sagarika Ghatge married in a court hall today

ముంబై: మరో క్రికెట్, బాలీవుడ్ కపుల్ పెళ్లితో ఒక్కటైంది. అయితే అందరిలాగా గ్రాండ్‌గా పెళ్లి చేసుకోకుండా.. కోర్టు హాలులో ఈ జంట ఏడడుగులు వేసింది. ఆ జోడీ ఎవరో కాదు.. మాజీ క్రికెటర్ జహీర్‌ఖాన్, బాలీవుడ్ నటి సాగరికా ఘాట్గే. రిసెప్షన్ మాత్రం గ్రాండ్‌గా చేయాలని నిర్ణయించారు. ఈ నెల 27న ఈ వెడ్డింగ్ రిసెప్షన్ ఉంది. దీనికి సంబంధించిన ఇన్విటేషన్ కార్డు కూడా బయటకు వచ్చింది. జహీర్‌కు చాలా సన్నిహితంగా ఉండే క్రికెటర్లు యువరాజ్, అగార్కర్, ఆశిష్ నెహ్రా, హర్భజన్‌తోపాటు బాలీవుడ్‌కు చెందిన ప్రముఖులను ఈ రిసెప్షన్‌కు ఆహ్వానిస్తున్నారు. ఆదివారం మెహెందీ, సోమవారం రిసెప్షన్ ఏర్పాటు చేశారు. చాలా రోజులుగా వీళ్లు ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. యువరాజ్ సింగ్ పెళ్లికి కూడా వీళ్లిద్దరు కలిసి వెళ్లారు. ఆ తర్వాతే తాము డేటింగ్‌లో ఉన్నట్లు ఈ జంట చెప్పింది. అయితే వీళ్లు కోర్టులో ఎందుకు పెళ్లి చేసుకున్నారన్నది మాత్రం ఇంకా తెలియలేదు. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లికి వచ్చారు. ఈ జంట పెళ్లి తర్వాత వచ్చిన తొలి ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.


11735
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles